top of page
Writer's pictureJindam Agro Farms

కొత్తిమీర!

మన రాష్ట్రంలో పండించబడే విత్తన సుగంద ద్రవ్యాల పంటల్లో ధనియాలు ముఖ్యమైనది. చల్లని వాతావరణంతోబాటు తక్కువ ఉష్ణోగ్రత తగినంత మంచు అనుకూలం.

నేలలు : వర్షాధారం కింద నల్లరేగడి భూములు, నీటి వసతి కింద గరప నేలలు, ఎర్రనేలలు మరియు ఇతర తేలిక పాటి భూములు అనుకూలం. నీరు నిలబడే లోతట్టు ప్రాంతాలు, అధిక ఆమ్ల, క్షార లక్షణాలు గల భూములు పనికి రావు.

విత్తటం : విత్తే కాలం : అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు, నీటి సదుపాయం వున్నచోట నవంబరు నెలాఖరు వరకు విత్తుకోవచ్చు.

కొత్తిమీర ఆకు కొరకు :ధనియాలను ఆకుకోసం సంవత్సరం అంతాసాగు చేసుకోవచ్చును. అయితే వేసవిలో కొత్తిమీర కొరకు చెట్టు నీడలో కాని, తాటాకు పందిరి కిందకాని షేడ్ నెట్ క్రిందకాని నీటి వసతికల ప్రాంతంలో సాగుచేసుకోవచ్చును.

నేల తయారి, విత్తటం :మెత్తటి పదును వచ్చే వరకు 3-4 సార్లు దుక్కిదున్నాలి. అక్టోబరు 15 నుండి నవంబరు 15 లోపు నేలలోని తేమను బట్టి విత్తుకోవాలి.

సాలుకు సాలుకు 30 సెం.మీ., మొక్కకు మొక్కకు 10 సెం.మీ. ఎడం వుండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి.

విత్తనాలను బద్దలుచేసి విత్తితే విత్తనం ఆదా అవటమేకాకుండా, మొలక కూడా 2 – 3 రోజులు ముందుగా వస్తుంది. విత్తే ముందు 5-6 గంటల సేపు నానబెట్టి, ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది.

నేల తయారి, విత్తటం :ఎకరానికి 6 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు అజోస్పైరిల్లం (బెయోఫర్టిలైజర్)ఎకరానికి 600 గ్రా.మోతాదు చొప్పున విత్తనానికి కలిపి శుద్ధి చేసినట్లయితే, దిగుబడి పది నుంచి పదిహేను శాతం వరకు పెరుగుతుంది.

ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో ధనియాల సాగు చేయరాదు. తప్పని సరిగా చేయవలసి వస్తే, 2 – 3 సంవత్సరాలు పంట‌ మార్పిడి చేసి ఉండాలి. వేసవిలో లోతు దుక్కి దున్నుకోవడం వలన తెగులును కలుగజేసే శిలీంధ్రాన్ని నేలలో అదుపు చేయవచ్చు.

విత్తే ముందు 5-6 గంటల సేపు నానబెట్టి, ఆరనిచ్చి విత్తినట్లయితే విత్తనం త్వరగా మొలుస్తుంది.

అలాగే ఒక గ్రా. కార్బండైజిమ్ న‌ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయడం ద్వారా కూడా తెగులు రాకుండా కాపాడవచ్చు. బయోఫర్టిలైజర్ మరియు శిలీంద్ర నాశనులతో విత్తనశుద్ధి చేయవలసినపుడు శిలీంద్రనాశనితో రెండు మూడు రోజుల ముందు విత్తనశుద్ధి చేయాలి. బయోఫర్టిలైజర్ తో మాత్రం విత్తే ముందే విత్తనశుద్ధి చేయాలి. ఎరువులు,అంతరకృషి : వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో ఆఖరిదుక్కిలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుతో బాటు 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 15 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి.

నీటిపారుదల కింద తేలికపాటి నేలల్లో పైన తెల్పిన మోతాదుతోబాటు విత్తిన 30 రోజులకు 12 కిలోల యూరియా, 7 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి.

విత్తిన వెంటనే పెండిమిధాలిన్ బరువైన నేలల్లో అయితే ఎకరానికి 1.3లీ., తేలిక నేలల్లో అయితే 1 లీ., 200 లీ. నీళ్ళలో కలిపి పిచికారి చేసుకొని మొదటి నెల వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు. విత్తనం మొలకెత్తటం పూర్తి అయిన తర్వాత ఒకసారి, 35 – 40 రోజులకు రెండవసారి గొర్రుతో అంతర కృషిచేయాలి.

అంతర పంటలు :ధనియాలతోబాటు ఆవాలు, కుసుమలు, శనగలు మిశ్రమ పంటలుగా వేసుకొనవచ్చు.

సస్యరక్షణ‌ పురుగులు పేను బంక :ఆకులు, పూత నుండి రసాన్ని పీల్చి గింజలు ఏర్పడకుండ చేస్తాయి. దీని నివారణకు లీటరు నీటిలో 1.6 మి.లీ మొనోక్రోటోఫాస్ లేదా మిధైల్ డెమిటాన్ 2.0 మి.లీ. లేదా డైమిధోయేట్ 2.0 మి.లీ కలిపి పిచికారి చేయాలి.

ఎర్రనల్లి :ఆకుల అడుగున గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు కలిపి పిచికారి చేసుకోవాలి.

తామర పురుగులు :ఆకులను, పూతను గీకి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ఫిప్రొనిల్ 2 మి.లీ. లేదా డైమిధోయేట్ 2.0 మి.లీ. లేదా మిధైల్ డి డెమిటాన్ 2.0 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు :పిల్లపురుగులు ఆకులను, పూతను, గింజలను తిని నష్టాన్ని కలుగ జేస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము కలిపి పిచికారి చేయాలి.

సస్యరక్షణ‌: తెగుళ్ళు బూడిద తెగులు:ఆకుల అడుగున చిన్న చిన్న బూడిద రంగు మచ్చలేర్పడి పై భాగానికి, కాండానికి వ్యాపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బండజిమ్ కలిపి పిచికారి చేయాలి.

ఎండు తెగులు :ఇది ‘ప్యుజేరియమ్ ఆక్సీస్పోరమ్’ అనే శిలీంధ్రం వలన ఆశిస్తుంది.

గింజ నలుపు తిరుగుట :ఇది సమస్యగా ఉన్నప్పుడు మాంకోజెబ్ 3 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పూత నుంచి గింజ పట్టే దశలలో రెండుసార్లు పిచికారి చేయాలి.

కోతలు మరియు అనంతర సాంకేతిక పరిజ్ఞానం: రకాన్ని బట్టి 40 – 45 రోజులకు పూత మొదలై న‌ 80 – 110 రోజులకు పక్వానికొస్తాయి. మొక్కలపై 60 శాతం గింజలు పక్వానికొచ్చినప్పుడు పంటకోసుకోవాలి. పంట ఉదయంపూట మాత్రమే కోయాలి. పంటకోసిన తర్వాత 2- 3 రోజులు పొలంలోనె ఆరనిచ్చి నూర్చుకోవాలి.

విత్తనం నిల్వచేయటం : నిల్వ ఉంచిన సంచులపై మలాధియాన్ చల్లటం, విత్తనాన్ని అప్పుడప్పుడు ఎండ బెట్టడం ద్వారా గింజను నిల్వలో ఆశించే పురుగుల నుండి రక్షించుకోవచ్చు.

ముఖ్యాంశాలు: * నిర్ధేశించిన మోతాదుకు మించి విత్తనాన్ని వాడరాదు. * సాధన, సింధు రకాలను త్వరగా బెట్టకు వచ్చే నేలల్లో వర్షాధారంగా సాగుచేయరాదు. * పైరు పూర్తి పూత మీద వున్నప్పుడు గంధకం (ఎర్రనల్లి, బూడిద తెగులు నివారణకు ) పొడి చల్లరాదు. * పైరు కోసిన తర్వాత 2-3 రోజులకంటే ఎక్కువగా పొలంలో ఎండ బెట్టరాదు. * పంట మార్పిడి అవలంబించాలి. * గొర్రు, గుంటకలతో రెండు సార్లు అంతరకృషి చేసినట్లయితే పంట బెట్టను తట్టుకుంటుంది.

1 view0 comments

Recent Posts

See All

పుదీన!

పుదీనా తైలం ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది. పుదీనాలో నాలుగు ముఖ్యమైన తెగలున్నాయి. అవేమనగా జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్...

Commenti


bottom of page