top of page

గోరుచిక్కుడు!

గోరుచిక్కుడు లేక కాయలను కూరగాయగా వాడుతారు. తీవ్ర కరువు పరిస్థితులను అధిక వేడిని తట్టుకొనగలుగుతుంది.

ఉపయోగాలు : లేత కాయలను కూరగాయగా వాడుతారు.కొన్ని రకాల గోరుచిక్కుడు గింజల నుంచి జిగురు తయారు చేసి ఈ జిగురును బట్టలు, పేపరు, నూనె, సౌందర్య సాధనాల పరిశ్రమలలో వాడుతారు. బాగా కొమ్మలు పెరిగే గోరుచిక్కుడు రకాలను పచ్చిమేతగాను, గింజలను పశువుల దాణాగాను వాడుతారు. ఈ పంటను పచ్చిరొట్ట ఎరువుగా మరియు ఔషధ తయారీలోను వాడుతారు.

వాతావరణం: ఉష్ణమండల పంట. మంచును తట్టుకోలేదు. తక్కువ వర్షపాతం. అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది.

నేలలు : మురుగు నీరు పోయే సౌకర్యం గల సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. అధిక సాంద్రత గల బరువైన నేలలు పనికిరావు. ఉదజని సూచిక 7.5-8.0 మధ్య గల నేలలు అనుకూలం.

రకాలు: పూసా మౌసమి : ఖరీప్‌ పంటకు అనువైనది. గింజ విత్తిన 70-80 రోజులకు మొదటి కోతకు వస్తుంది. కాయలు 10-12 సెం.మీ. పొడవు ఉంటాయి. మొక్క కొమ్మలతో ఉంటుంది.

పూసాసదాబహార్‌ : ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైనది. గింజ విత్తిన 45-50 రోజులకే మొదటి కోతకు వస్తుంది. కాయలు 12-13 సెం.మీ. పొడవు ఉంటాయి. మొక్క కొమ్మలతో ఉంటుంది.

పూసానవబహార్‌(పూసా మౌసమిపూసా సదాబహార్‌): దీని కాయలు పూసా మౌసమిలా ఉంటాయి. మొక్క కొమ్మలు లేకుండా ఉంటుంది. ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైన రకం.

ప్రైవేట్‌ రకాలు (గౌరి) : ఖరీఫ్‌, వేసవి పంటలకు అనువైనది విత్తే సమయం : ఖరీఫ్‌ : జూన్‌ నుండి జూలై వరకు

వేసవి : జనవరి రెండవ పక్షం నుండి – ఫిబ్రవరి చివరి వరకు

విత్తన మోతాదు : ఎకరాకు 12-16 కిలోలు

విత్తనశుద్ధి : విత్తేముందు కిలో విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్‌ మరియు 4గ్రా. ట్రైకోడెర్మ విరిడి కలిపి విత్తనశుద్ధి చేయాలి.

నేల తయారీ మరియు విత్తటం : నేలను అదును వచ్చే వరకు 4-5 సార్లు బాగా దున్నాలి. మొదటిసారి గోరుచిక్కుడు విత్తేటట్లయితే రైజోబియం కల్చర్‌ విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వర్షాకాలంలో 60 సెం.మీ. దూరంలో కాలువలు, బోదెలు చేసుకోవాలి. వేసవిలో చిన్న మళ్ళుగా చేసి విత్తుకోవాలి.

విత్తేదూరం : ఖరీఫ్‌ పంట : 60X15 సెం.మీ., వేసవి పంట : 45 X 15 సెం.మీ. వేసవిలో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండేటట్లు చూడాలి.

ఎరువులు : ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఎకరాకు 12 కి|| నత్రజని, 25 కి||ల భాస్వరం, 25 కి|| పొటాష్‌నిచ్చే ఎరువులు వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని విత్తిన 30-40 రోజులకు వేసుకోవాలి.

అంతరకృషి : కలుపు నివారణకు పెండిమిథాలిన్‌ మందును ఎకరాకు 1.25 లీ. లేదా అలాక్లోర్‌ 1.0 లీ. (తేలిక నేలలు), 1.25 లీ. (బరువు నేలలు) చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు పిచికారీ చేయాలి. తడినేలపై పిచికారీ చేయాలి. 30 రోజులకు ఒకసారి గొప్పు తవ్వి అంతరకృషి చేయాలి.

నీటి యాజమాన్యం : గింజలు విత్తగానే నీరు పారించాలి. 3వ రోజు మరల యివ్వాలి. ఆ తర్వాత ప్రతి 7-10 రోజులకు ఒకసారి నీటి తడులు యివ్వాలి.

సస్యరక్షణ: పేనుబంక : చిన్న, పెద్ద పురుగులు లేత చిగుళ్ళు, ఆకుల నుండి రసం పీల్చి నష్టం కల్గిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథ