top of page

చేమ గడ్డ!

మనరాష్ట్రంలో చేమగడ్డ పంటను అన్ని కోస్తా జిల్లాల్లోను మరియు కొన్ని రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోను సాగుచేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా సాగుచేయబడుతుంది.

వాతావరణం : ఇది ఉష్ణ మండలపు పంట, దానికి ఎప్పుడు భూమిలో తేమ అధికంగా ఉండాలి.

నేలలు- నేల తయారి : నీటివసతి కలిగి మరియు నీరు బయటకు పోవు సదుపాయం గల నేలలు అనుకూలం. వేసవలో భూమిని 30-40 సెం.మీ. లోతుగా దున్నాలి. తొలకరి వర్షాలకు 2-3 సార్లు గొర్రుతో మెత్తగా దుక్కి దున్ని చదును చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుండి 10 టన్నుల చివికిన పశువుల ఎరువు మరియు 24 కిలోల భాస్వరం యిచ్చు ఎరువును సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వేసి కలియదున్నాలి.

నాటే సమయం : కోస్తా జిల్లాల్లో జూన్‌-జూలై, ఫిబ్రవరి-ఏప్రిల్‌ నెలలు నాటటానికి అనుకూలం. తెలంగాణ ప్రాంతంలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్‌ వరకు నాటటానికి అనుకూలం.

రకాలు: రకం(నేలల్లో) కాలపరిమితి దిగుబడి నాటేదూరం (సెం.మీ.) 1. శతముఖి 6-7 8 45X30 2. కె.సి.యస్‌.-2 8 14 45X45 3. కె.సి.యస్‌.-3 5 9.6 45X30 4. ఆర్‌.యన్‌.సి.ఎ.-1 6 8 45X30

విత్తేదూరం : ఎకరాకు 300-400 కిలోలు. విత్తనంగా తల్లిదుంపలు వాడితే దిగుబడి పెరుగుతుంది.

ఎరువులు : ఎకరాకు 10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 24 కిలోల భాస్వరం, 48 కిలోల నత్రజని, 32 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులు వేయాలి. పశువుల ఎరువు మరియు భాస్వరపు ఎరువును సూపర్‌ఫాస్ఫేటు రూపంలో పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. నత్రజని, పొటాష్‌ ఎరువులను యూరియా, మ్యూరేట్‌ రూపంలో, మూడు సమభాగాలుగా చేసి దుంప మొలకెత్తిన తర్వాత 30, 60, 90 రోజులలో వేయాలి. ఎరువులను మొక్క రెండు గుంటల్లో వేసి మట్టితో కప్పి, తేలికపాటి తడిపెట్టాలి.

అంతరకృషి : మొదటి దఫా తడిపెట్టిన తర్వాత తేమ ఉన్నపుడు ఎరాకు 2.0లీ. బ్యుటాక్లోర్‌ లేక 1.3లీ. పెండిమిథాలిన్‌ 30% లేదా 200 మి.లీ. ఆక్సీఫ్లోరోఫిన్‌ 22.5%లలో ఏదో ఒక దానిని 200 లీ. నీటిలో కలిపి భూమిపై పిచికారి చేయాలి. పొడిగా ఉన్న భూమిపై చల్లిన మందులు ఫలితమివ్వవు. 40-45 రోజుల తర్వాత పలుచగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి.

సస్యరక్షణ: పొగాకు లద్దెపురుగు : పంటపై ఆశించి ఆకులను పూర్తిగా తినివేసి నష్టాన్ని కలుగజేస్తుంది. పొగాకులద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. ఎకరాకు 4 చొ||న లింగాకర్షక బుట్టలు పెట్టాలి. 250 లార్వాలకు సమానమైన యన్‌.పి.వి. వైరస్‌ ద్రావణం వారానికి ఒకసారి చొ||న 4 వారాలు పిచికారి చేయాలి. సాలుతో అక్కడక్కడ ఆముదం మొక్కలు వేసి వాటిపై వున్న గుడ్ల సంచులను ఏరి నాశనం చేయాలి. పురుగు తొలి దశలలో క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లేదా ఎండోసల్ఫాన్‌ 2 మి.లీ. లీటరు నీటికి చొ||న కలిపి పిచికారి చేయాలి. పురుగు చివరి దశలలో విషపు ఎరలను పెట్టాలి. దీని కొరకు 5 కిలోల తువుడు+1 కిలో బెల్లం+500గ్రా. మిథోమిల్‌ లేదా కార్బరిల్‌ 50 శాతం తగినంత నీటికి కలిపి వుండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలంలో పెట్టాలి.

నల్లి : ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చటం వలన, పత్రహరితాన్ని కోల్పోయి ఆకులు రాలిపోతాయ.ఇ త్వరగా ఎండిపోతాయి. దీని నివారణకు ఫాసలోన్‌ 2.0 మి.లీ. నీటిలో కరిగే గంధకం 3గ్రా. లీటరు నీటికి కలిపి, ఆకులపైన, క్రింద తడిసేలా పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు : వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా వున్నపుడు ఈ తెగులు త్వరగా వృద్ధి చెంది ఆకులు కుళ్ళి ఎండిపోతాయి. ఆకు తొడిమలపై వస్తే ఆకుపూర్తిగా మాడిపోతుంది. లీటరు నీటికి 2.5గ్రా. ఇండోఫిల్‌ యం.45 కలిపి 10 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారి చేసి ఈ తెగులును అరికట్టవచ్చు.

1 view0 comments

Recent Posts

See All

Comments


bottom of page