top of page

పెసర!

ముఖ్యంగా తెలంగాణా,రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు . రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో,వేసవిలో కృష్ణ , గోదావరి డెల్టా ప్రాంతాలలో మూడవ పంటగాను పండిస్తున్నారు.నీరు ఆలస్యంగా వచ్చి వారి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాలలో పండించవచ్చు . ప్రత్తిలో అంతర పంటగా కూడా పండించవచ్చు. 

నేలలు

పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు.కాని చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు .

నేల తయారి

ఒకసారి నాగలితోను , రెండుసార్లు గోఱ్ఱుతోను మెత్తగా దున్ని గుంటకు తోలి నేలను తయారు చేయాలి .వరి కోసిన పోలాల్లో దుక్కి దున్నవలసిన అవసరం లేదు

విత్తే సమయం

ఖరీఫ్ కాలంలో ఉత్తర తెలంగాణా , దక్షణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోను , కృష్ణ – గోదావరి , దక్షణ మండలం మరియు ఉత్తరకోస్తా మండలాల్లో జూన్ – జులై లోను విట్టుకోవచ్చు . రబీలో ఉత్తర , దక్షణ తెలంగాణా , కృష్ణ – గోదావరి దక్షణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకోవచ్చు . కృష్ణ – గోదావరి మండలంలో వరి మాగాణాల్లో నవంబర్ – డిసంబర్ మొదటి వారంలో , వేసవికాలంలో ఫిబ్రవరి – మర్చి లో విత్తుకోవచ్చు .

విత్తన శుద్ధి

కిలో విత్తనానికి 30 గ్రాముల కర్భోసల్ఫేట్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి . ఈ పైరుకు కోత్తగా పండించేటప్పుడు , రైజోబియం కల్చరు ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు .

విత్తటం

సాళ్ళ గోర్రుతో వేదబెట్టాలి . మాగాణాల్లో వరి కోయడానికి 2-3 రోజుల ముందు భూమి తేమ పరిస్థితి బట్టి తడి లేక పొడి విత్తనాలు వేదజల్లాలి .

ఎరువులు

పశువుల ఎరువు 2000 కిలోలు ఎకరాకు దుక్కిలో వేసి కలియ దున్నాలి. నత్రజని 8 కిలోలు ఎకరాకు విత్తనం జల్లే ముందు, భాస్వరం ఎకరాకు 20 కిలోలు విత్తనం జల్లే ముందు వేసుకోవాలి. వరి మాగాణుల్లో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. హెక్టారుకు నత్రజని 90 కిలోలు , భాస్వరం 50 కిలోలు , పోటాష్ 30 కిలోలు వేసుకోవాలి . నత్రజని మాత్రము 30 కిలోలు మొదటి దఫా ఇతర ఎరువులతో కలిపి దుక్కిలో వేసుక్కోవాలి . మిగిలిన 60కిలోల్లో ఒక పర్యాయం 30కిలోలు మొదటి గల పూత దశలో అనగా 40 నుండి 50 రోజుల్లో ,మిగిలిన 30కిలోలు రెండవ గల పూత దశలో అనగా 70 నుండి 80 రోజులలో వేసుకుని నీరు కట్టుకోవాలి.

నీటి యాజమాన్యం

పెస్సర వర్షాధారపు పంట . కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు ఒకటి ,రెండు నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మగణుల్లో నీటి తడి అవసరం లేదు .రబీ వరి తరవాత వేసవి లో పండించే పెసరకు 25-30 రోజుల దశలో మరోసారి తేలిక .

కలుపు నివారణ అంతర కృషి

ఫ్లుక్లోర్లిన్ 40 శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తే ముందు పిచికారి చేసి భూమిలో కలియ దున్నాలి లేక పెండిమేతలిన్ 30 శాతం ఎకరాకు 1.3 -1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి . విత్తన 20-25 రోజులపుడు గోర్రుతో అంతరక్రుషి చేయాలి .మాగాణి పెసరలో ఊధ నిర్మూలనకు పెనక్సప్రాప్ ఇథైల్ 9 శాతం ఎకరాకు 250 మీ.లీ. చొప్పున విత్తిన 20-25 రోజులపుడు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి . తొలకరి లో పెసర సాగుకు ఒకేసారి కోతకు వచ్చి కాయ వర్షంలో కొంచెం తడిసిన గాని గింజలు మొలకేత్తని రకాన్ని (యల్.జి.జి.450) ఎన్నుకోవాలి. పెసరను వర్షాలు తగ్గినా తరవాత గాని , రబీ లో గాని వేసవిలోగాని పండించాలి .

బూడిద తెగులు

ఈ తెగులు విత్తన 30-35 రోజులు తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు.ముదురు ఆకులపై , బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన , క్రింద భాగాలకు మరియు కొమ్మలు , కాయలకు వ్యాపిస్తుంది . నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కర్బండిజం లేదా 1 గ్రాము తయోఫానేట్ మిథైల్ లేదా 1 మి.లి. కేరాథెన్ లేదా 1 మి.లి హెక్సాకొనజొల్ లేదా 1.మి.లి ట్రైడిమర్ఫ్ లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి . నిర్దేశించిన కాలంలో విత్తుకోవాలి . మొక్కల సాంద్రత సరిపడా వుండాలి . తెగులను తట్టుకునే రకాలను విత్తుకోవాలి.

చిత్తపురుగులు

ఈ పురుగులు పైరుపై రెండు ఆకుల దశలో ఆశించి రంద్రాలు చేస్తాయి . వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించాకపోతే 80 శాతం మొక్కలు ఈదశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిఫాన్ లేదా 2.0 మి.లీ ఎండోసల్ఫాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .

తామరపురుగులు

ఈ పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది రసాన్ని పిలుస్తాయి . వీటి వల్ల ఆకు ముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది.పంటకు 15-20 శాతం నష్టం కలుగుతుంది . నివారణకు మొనోక్రోటోఫాన్ 1.5 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా .లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .

2 views0 comments

Comments


bottom of page