top of page

కంది!

కంది

ప్రత్తి,మిరప పోగాకులకు ప్రత్యామ్నాయ౦గా అలాగే పెసర,మినుము,సోయాచిక్కుడు,వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్ తో పండించవచ్చు.కందిని సాధారణంగా తొలకరి పంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగుచేస్తుంటారు.కందిని రబీ లో కూడా పండించవచ్చు.

నేలలు

నీరు త్వరగా ఇంకిపోయే గరప,ఏఱ రేగడి,చల్కా నేలల్లో మరియు మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు.చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికి రావు. భూమిని రెండు సార్లు నాగళ్ళతో దున్ని మెత్తగా తయారు చేయాలి.

విత్తే సమయ౦

ఖరిఫ్ లో ఉత్తర తెలంగాణా,దక్షిణ తెలంగాణా మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ లోను;కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం మరియు ఉత్తర కొస్తా మండలాల్లో జూన్-జూలై నెలల్లోను;రబీలో ఉత్తర,దక్షిణ తెలంగాణాల్లో సెప్టెంబరు లోను,కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం,ఉత్తర కొస్తా మండలాల్లో సెప్టెంబరు-అక్టోబరు నెలల్లోను విత్తుకోవచ్చు.

ఎరువులు

చివరి దుక్కిలో ఎకరాకు 2టన్నుల పశువుల ఎరువు,ఖరిఫ్ లో 8కిలోలు,రబీ లో 16కిలోలు నత్రజని ,ఈ రెండు కాలల్లోను 20కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి.అంతరమైన వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది.ప్రధాన పైరుకు,అంతర పంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి.

నీటి యాజమాన్యం

ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో రబీ కందికి 2తేలిక పాటి తడులు ఇవ్వాలి.ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి,కాయ దశలో ఒకసారి ఇవ్వాలి.

ఎండుతెగులు

ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని మొక్కలో కొంత భాగ౦ గాని వాడి ఎండి పోతాయి.ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి.నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి.ఐ.సి.పి.య.ల్ 87119 మరియు ఐ.సి.పి.య.ల్ 8863 అనే కంది రకాలు ఈ తెగులును తట్టుకొంటాయి.ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు.నీరు నిల్వ వుండే భూముల్లో క౦దిని సాగు చేయకూడదు.

ఆకుచుట్టు పురుగు

కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది.ఆకులను,పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. నివారణకు 1.6మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 2.0మి.లీ క్వినాల్ ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయతొలుచు పురుగు

ఈ పురుగు పూత ,పిందె దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ,ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది.

1 view0 comments

Comments


bottom of page