top of page
Writer's pictureJindam Agro Farms

Blackgrams / మినుము!

02 January 2019

మినుము

రాష్ట్రంలో మినుమును తొలకరిలోనూ, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

నేలలు

మురుగు నీరుపోయే వసతి గల, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి. చౌడుభూములు పనికిరావు.వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలుపడగానే గొర్రు తోలి భుమిని మెత్తగా తయారు చేయాలి.

విత్తే సమయం

తొలకరిలోజూన్ లేక జులై మాసాలలు ,రబీ మెట్టిలో ఆక్టోబర్ మాసంలో,రబీ మాగాణిలో నవంబర్ మాసంలో ,వేసవి ఆరుతడిలో ఫిబ్రవరి మాసంలో,వేసవి మాగాణల్లో మార్చి మాసంలో విత్తుకోవాలి.

విత్తన మోతాదు

తొలకరిలో ఎకరానికి 6, 5.8 కిలోలు,రబీమోట్టిలో ఎకరానికి 6,5.8 కిలోలు ,రబీ మాగాణి లొ ఎకరానికి 16 కిలోలు, వేసవి ఆరుతడిలో ఎకరానికి 10-12 కిలోలు ,వేసవి మాగాణిలో ఎకరానికి 16-18 కిలోలు విత్తనాలను వితుకోవాలి.

విత్తన శుద్ధి

కిలో విత్తనానికి ౩౦ గ్రాముల కార్బోసల్ఫాన్ మరియు 2.5 గ్రా థైరమ్ లేదా కాకాప్తాన్స్ మ౦దును వాడి విత్తన శుద్ది చేయాలి.

విత్తే దూరం

తొలకరిలో ౩౦X10 సెం.మీ.,రబీమెట్టలో ౩౦X 10సెం.మి., వేసవి ఆరుతడిలో 22.5X10సెం.మీ .దూరంలో విత్తికోవాలి,రబీ మరియువేసవి మాగాణిలలు వెదజలాలి.

ఎరువులు

భూమిని బాగా దుక్కి దున్ని విత్తటానికి ముందు హెక్లారుకు 20 కిలో ల నత్రజని ,50 కిలోల భాస్యరం నిచ్చే ఎరుపులను వేసి గోఱ్ఱుతో కలియదున్నాలి. వరి మాగాణుల్లో మినుము పాగు చేసేతప్పుడు ఎరువులువాడనవసర౦ లేదు.

నీటి యాజమాన్యం

వర్షాభావ పరిస్ధితి ఏర్వడినప్పుడు ఒకటి రెండునీటి తడులు ఇవ్వవలసివస్తుంది.వరి మాగాణుల్లో నీటి తడి ఇవ్వవచ్చు.ఒకటి రెండుతేలిక తడులు,౩౦ రోజులు లోపు మరియు 55 రోజుల తర్వాత ఇస్తే అధిక దిగుబడులు సాధి౦చవచ్చు.

కలుపు నివారణ మరియు అంతరకృషి

మెట్ట మినుములో విత్తుటకు ము౦దు ప్లూక్టోరాలిస్ 45% ద్రావకం ఎకరాకు 1 లీటరు చొప్పన భూమి పై పిచికారి చేసి గుంటకతో పై పైన కలియదున్నాలి లేదా పె౦డిమిథాలిస్ 30% ద్రావకం ఎకరాకు 1.3 ను౦డి 1.6 లీటరు చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గోర్రుతో అ౦తరకృషీ చేయాలి. మాగాణి మినుములో ఊద, చిప్పెర, గరిక లా౦టి గడ్డి జాతీ మొక్కల నిర్మూలనకు ఫెనాక్సోపాప్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మి-లి- లేదా క్యేజలాసాప్ ఇథైల్ 5 శాత౦ ద్రావకం ఎకరాకు 400 మి.లి చొప్పున ఏదొ ఒక దానిని 200 లిటర్ల నీటిలో కలిపి విత్తిన 20-25 రోజులప్పుడు పీచికారి చేసి సమర్ధవ౦త౦గా కలుపుసు నివారిలచుకోవచ్చు

అకుమచ్చ తెగులు

ఈ తెగులు సోకిన ఆకుల పై చిన్న చిన్న గు౦డ్రని గోధుమ ర౦గు మచ్చలు ఏర్పడి అనుకూల వాతావరణ పరిస్దితుల్లో పెద్ద మచ్చలు వలయాకార౦గా ఏర్పడి ఆకులు ఎ౦డి రాలిపోతాయి.లీటరు నీటికి 2.5 గ్రా. మా౦కోజెబ్ లేదా ౩ గ్రా. కాపర్ అక్సీక్లోరైడ్ లను 10 రోజుల వ్యవధిలో రె౦డుసార్ణు పిచికారి చేయాలి.యల్.బి.జి-648 రకం ఈ తెగులును తట్టుకొ౦టు౦ది. కార్చ౦డజిను వాడరాదు. గట్ల మీద వున్న పైరుకు వెంటనే మ౦దును పిచికారి చేయాలి.

బూడిద తెగులు

ఈ తెగులు వితిన 30-35 రోజులు తర్వాత గాలి లో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకుల పై బూడిద రూప౦లో చిన్నచిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్ద పై ఆకుల పైన,క్రి౦ద భాగాలకు మరియు కొమ్మలకు,కాయలకు వ్వాపిస్తు౦ది. నివారణకు లీటరు నీటికి 1 గ్రా. కార్చ౦డజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిధైల్ లేదా 1 మి.లీ. కెరాథేస్ లేదా 1 మి- లీ.హెక్సాకొనజోల్ లేదా 1 మి-లీ- టైన్టీడిమార్ఎ లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రె౦డు సార్లు పీచికారి చేయూలి. నిర్దేశి౦చిన కాల౦లో విత్తుకోవాలి. మొక్కల సా౦ద్రత సరిపడా పు౦డాలి. లెగుళ్ళను తట్టుకునే రకాలను విత్తుకోవాలి.

1 view0 comments

Comments


bottom of page