Cotton / పత్తి!

పత్తి

భారతదేశం ప్రపంచంలోని ప్రత్తి ఉత్పత్తి మరియు నూలు ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. మన రాష్ట్రం భారతదేశంలోనున్న సాగు విస్తీర్ణంలో 12.6 శాతం కలిగి మొత్తం ప్రత్తి ఉత్పత్తి లో 14 శాతం మేర ఆక్రమించింది.

నేలలు

తేమను నిలుపుకోగల నల్ల రేగడి నేలలు,ఒండ్రు నేలలు అనువైనవి.తేలిక భూములలో ప్రత్తి సాగు చేయకూడదు.

సేంద్రియ ఎరువులు

ప్రత్తి పంటకు హెక్టారుకు కనీసం 10 టన్నుల పశువుల ఎరువు తోలుట అవసరం.సేంద్రియ ఎరువులతోపాటు జీవన ఎరువులను విత్తనములకు పట్టించి రసాయనపు ఎరువులను తగు మోతాదులో వాడుకోవాలి.

జీవన ఎరువులు

అజటోబాక్టర్ ,అజొస్పైరిల్లా వంటి సూక్ష్మజీవులు మొక్క వేళ్ళ ద్వారా విసర్జించే పదార్దాలను గాలిలోని నత్రజనిని ఉపయోగించుకుని పెరుగుతూ,మొక్కలను ఉపయోగపడే హార్మోన్లు తదితర నత్రజని పదార్ధాలను విసర్జిస్తాయి.పంటలు ఏపుగా ఆరోగ్యవంతంగా పెరగడానికి ఈ పదార్ధాలు ఉపయోగపడతాయి.ఈ ఎరువులు ఉపయోగపడాలంటే సేంద్రియ ఎరువులు బాగా వేయాలి.

నీటి యాజమాన్యం

ప్రత్తి పంటకు 500మి.మీ నీరు అవసరమౌతుంది,పంట వేసిన 75 నుండి 120 రోజుల మధ్య బెట్ట లేకుండా చూడాలి.దీని కోసం ఆయా ప్రాంతాలలోని వర్షాలు కురిసే సరళిని బతి విత్తే సమయమును మార్పు చేసుకోవాలి.ప్రత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు కనుక నీరు ఎక్కువగా పెట్టరాదు.భూమిలో వున్న తేమను బట్టి 20-25 రోజులకొకసారి నీరు పెట్టాలి.సామాన్యంగా ఎరువులు వేసిన వెంటనే మరియు పూతసమయంలో,కాయ’ తయారగు సమయంలో నీరు పెట్టాలి.ఖరీఫ్ లో 2-3 తడులు,రబీ లో ఆరు తడులు అవసరం ఉంటుంది.నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలం పోదిగించరాదు.

అంతరపంటలు

ప్రత్తితో పాటుగా పెసర,మినుము,జొన్న,మొక్కజొన్న,సోయాచిక్కుడు,అలసందలు,వేరుశనగ,కొర్ర వంటి పైర్లను అంతర పంటలుగా సాగు చేస్తే ఎక్కువ లాభం వస్తుంది.ప్రత్తి పంట మధ్య ఒకటి లేక రెండు వరుసలలో అంతరపంటలు వలన అధిక ఆదాయాన్ని పొందవచ్చును.అంతేకాక బదనికల సంతతి పెరగటం ద్వారా పురుగుల ఉధృతిని అదుపులో ఉంచవచ్చును.

వేరుకుళ్ళు తెగులు

భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఈ తెగులు పైరు అన్ని దశలలో కనపడుతుంది.లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండిపోయి చనిపోతాయి.వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకు చెట్టుపై నుండి క్రిందికి వ్రేలాడుతూ వుంటాయి. నివారణ : కిలో విత్తనానికి 2గ్రా.ట్రైకోడేర్మా విరిడితో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా.లేదా కార్బ౦డిజిమ్ 1గ్రా.లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి.

ఆకుమచ్చ తెగులు

ఆల్టర్నేరియా ఆకుమచ్చ వలన ఆకులమీద మధ్యలో గోధుమ రంగు మచ్చలు వలయాకారపు రింగులుగా ఏర్పడతాయి. సెర్కోస్పొరా ఆకుమచ్చ వలన ఆకుల మీద ముదురు గోధుమ రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి చుట్టూ ఎరుపు వర్ణం కల్గి మధ్యభాగం తెల్లగా వుంటుంది. -హెల్మి౦తోస్పోరియం ఆకుమచ్చ వలన ఆకులమీద తేలిక గోధుమరంగు గుండ్రని మచ్చలు ఏర్పడి మధ్యబాగం బూడిద రంగుతో చుట్టూ ఎర్రటి అంచులు ఏర్పడతాయి. ఈ తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి2.5 గ్రా.మా౦కోజెబ్ లేదా రాగిధాతు మందు(కాపర్ ఆక్సీక్లోరైడ్) 3గ్రా.లేదా క్యూమాన్.ఎల్ 4మి.లీ.4-5పర్యాయాలు 15రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. పండాకు తెగులు : ప్రత్తిలో ఆకులు ఎర్రబడటాన్ని పండాకు తెగులు అంటారు.ముఖ్యంగా ,ఇది మొక్క అడుగు భాగాన ఆకుల మీద కనపడుతుంది.ఆకులు మొదట ముదురు గులాబి రంగుకు మారి,ఆ తరువాత పూర్తి ఎర్రగా మారి,క్రమేపి ఎండిపోయి,రాలి పోతాయి.ఇది మొక్క 50నుండి60రోజుల దశ దాటినప్పటి నుండి రావడానికి అవకాశ౦ వుంది.ఇది చాలా తొందరగా వ్యాపించి,ఒక్కొక్కసారి పచ్చ దోమ ఉధృతిని కలిసి వున్నప్పుడు,పచ్చ దోమ వలన వచ్చిందేమోనన్న అనుమానం కూడ కలుగ జేస్తుంది.పండాకు తెగులు రావటానికి గల కారణాలను విశ్లేషి౦చినపుడు మొక్కలో నత్రజని,పొటాషియం,బాస్వర౦ పోషక పదార్థ లోపం ఏర్పడటం. రాత్రి ఉష్ణోగ్రత 21c కంటే తగ్గిపోవటం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటం. గాలి వేగం అధికంగా వుండటం. పండాకు తెగులు నివారణకు 1% మెగ్నీషియం సల్ఫేట్ తో పాటుగా 2%యూరియా లేదా 1% డైఅమ్మోనియమ ఫాస్ఫేట్ కలిపి 5-7రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

పేనుబంక

ఈ పెనుబ౦క ప్రత్తిని ముఖ్యంగా తొలి దశలో ప్రత్తి పండించే అన్ని ప్రాంతాలలో ఆశిస్తాయి.ఈ పేలు సాధారణంగా జూలై,ఆగుష్టు నెలల్లో వర్షానికి మధ్య వచ్చే బెట్టకాలంలో పైరుపై అనువుగా పెరుగుతాయి.వర్షాలోచ్చినప్పుడు ఈ పేల సాంద్రత తగ్గిపోతుంది. పిల్ల,పెద్ద పేలు ఆకుల అడుగుభాగంలో,కొమ్మల పైనుండి రసం పీల్చుతూ జీవిస్తాయి. అందుచేత మొక్క ఎదుగుదల నశిస్తుంది.ఇవి విసర్జించే తేనె వంటి పదార్థము వలన ఆకులు,కా౦డముపై మసి తెగులు(సూటిమోల్టు) వ్యాపిస్తుంది. నివారణ : విత్తనశుద్ది(ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా.1కిలో విత్తనానికి)మరియు కాండము మీద 20,40,60 రోజుల పైరుపై మోనోక్రోటోఫాస్:నీరు(1:4)లేక ఇమిడాక్లోప్రిడ్:నీరు(1:20) కలిపి కుంచతో పూసి ఈ పురుగును అదుపులో పెట్టవచ్చును.ప్రత్తి లో 15-20 పేనుబంక ఆశించిన మొక్కలు కనిపిస్తే నివారణ చర్యలు చేపట్టాలి.

తెల్ల దోమ

తెల్ల దోమ పురుగు ఎక్కువగా నవంబర్ నుంచి జనవరి-ఫిబ్రవరి మాసాల వరకు ప్రత్తిని ఆశిస్తూ ఉంటుంది.గ్రుడ్ల నుండి వెలువడిన పిల్లలు,ఈ నెల దగ్గరగా స్థిరపడి రసాన్ని పీలుస్తాయి.పిల్ల పురుగులు ఆకుల అడుగుబాగాన నిశ్చలంగా నిలిచిపోయి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకి మారి ఎండిపోయి,మొక్కలు గిడసబారి పోతాయి.ఈ పురుగులు విసర్జించే తేనెవంటి పదార్ధం వలన నల్లని బూజుతెగులు వ్యాపిస్తుంది.ఈ దోమ ఆశించిన పైరులో ఆకులు,మొగ్గలు,పిందెలు రాలిపోవటమే కాకుండా,కాయలు పూర్తిగా ఎదగకముందే పగిలిపోతాయి మరియు పింజ నాణ్యత క్షీణిస్తుంది.గింజలలో నూనె శాతం కూడా తగ్గిపోతుంది. నివారణ : ఆకుకు 5-10 తెల్ల దోమలు గమనించిన ట్రైజోఫాస్ 2.5మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.వేప సంభందిత మందులు ఈ పురుగును అదుపు చేస్తాయి.కాయతొలిచే పురుగులను నివారించడానికి వాడే సింథటిక్ పైరిత్రాయిడ్స్ వలన ఈ పురుగు ఉధృతం చాలా ఎక్కువవుతుంది.తెల్ల దోమ అదుపుకు విధిగా అధిక మోతాదు నీటితో,నాప్ సాక్ స్ప్రేయార్ ద్వారా పిచికారి చేయాలి.

అంతర కృషి

కలుపు నివారణ,అంతర కృషి విత్తే ముందు ఫ్లుక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిథాలిన్ 30శాతం ఎకరాకు 1.3నుండి 1.6లీ.లేదా అలక్లోర్ 50శాతం 1.5నుండి 2.5లీటర్లు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.విత్తిన 25,30 రోజులప్పుడు మరియు 50-55 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకలతో అంతరకృషి చేయాలి.ఖరీఫ్ లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి కుదరనప్పుడు ఎకరాకు లీటరు పెరాక్వాట్ 24శాతం 200లీ.నీటిలో కలిపి ప్రత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు స్ప్రే చేసుకోవాలి.

Expert Advice


0 views0 comments