top of page

Groundnut / వేరుశనగ!

వేరుశనగ

నేలలు : 1.ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్టం.చల్కా మరియు ఎర్ర గరపనేలలు కూడా అనుకూలం.ఎక్కువ బంక మన్ను గల నీరు ఉండేనల్లరేగడి నేలల్లో పంట వేయరాదు. 2.నేలను మెత్తగా,గుల్లగా దుక్కిచేసి చదును చేయాలి.

విత్తనము

నిద్రావస్థగల రకాల విత్తనాన్ని 5మి.మీ ఇథరిల్ ను 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణ౦లో 12గంటలు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.విత్తనమును 5సె౦.మీ లోతు మించకుండా విత్తవలెను. వర్షాధారముగా ఖరీఫ్ లో గుత్తి రకములకు చ.మీ కు ౩౩,రబీ లో 44 మొక్కలు ఉండవలెను. వర్షాధారముగా ఖరీఫ్ లో తీగ రకములకు చ.మీ కు 22 మొక్కలు ఉండవలెను.

సమతుల్య ఎరువుల వాడకం

ఎకరాకు పశువుల ఎరువు 10 బళ్ళు,వేపపిండి 150 కిలోల చివరి దుక్కులలో వేయవలెను. జింకులోపము సరిదిద్దుటకు విడిగా 20కిలోలు (ఎకరాకు) జింకు సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయవలెను. భూసార పరిక్షననుసరించు రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించవలెను. సాధారణంగా 1 ఎకరా వేరుశనగ పైరుకు(కిలో లలో) యూరియా సింగల్ సూఫర్ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఖరీఫ్ 20 100 30 రబి 20 100 30 పైన చూపిన ఎరువులను విత్తేముందు వేయాలి.శాస్త్రజ్ఞుల పరిశోధనలో విత్తిన 30రోజులకు పై పాటుగా యురియా వేయడం వలన పెద్ద ఉపయోగం లేదని తేలింది.కావున రైతు సోదరులు ఎరువుల మీద పెట్టే వృధా ఖర్చు తగ్గించుకోగలరు. తొలిపూతదశలో(30 రోజులు)1 ఎకరమునకు 200కి.గ్రా జిప్సమ్ ఎరువును మొదళ్ళుకు దగ్గరగా 5సె౦.మీ లోతులో వేయాలి.జిప్సమ్ వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ అవసరం.జిప్సంలోని కాల్షియం,సల్ఫర్ వలన గింజ బాగా ఊరటమే కాకుండా నూనె శాతం కూడా పెరుగుతుంది. కొత్తగా వేరుశనగ సాగుచేయు భూములలో జీవన ఎరువగు రైజోబియం కల్చర్ 200 గ్రా 1 ఎకరము విత్తనమునకు,1గంట ముందు,పట్టించి విత్తవలెను. భాస్వరము కరగదీయు బాక్టీరియా జీవన ఎరువు కూడ 400గ్రాలు 1ఎకరము విత్తనమునకు పట్టించి విత్తవలెను.

నీటి యాజమాన్యం

విత్తినప్పుడు ఇచ్చిన తడి తర్వాత 20-25 రోజులకు రెండవ తడిఇవ్వవలెను.తర్వాత 7-10 రోజుల వ్యవధిలో తడులు అవసరాన్ని బట్టి ఇవ్వవలెను.ఊడలు దిగే దశ(45-50)నుండి కాయలు ఊరే వరకు (85-90) సున్నితమైన దశలు.ఈ దశలలో సక్రమంగా తడులు ఇవ్వవలెను.

అంతరపంటలు

వేరుశనగ పంటలో కంది,ఆముదము అంతర పంటలుగా వేసుకోవచ్చు వేరుశనగ మరియు కంది 7:1 లేక 11:1 నిష్పత్తి లో విత్తుకోవచ్చు.వేరుశనగ మరియు ఆముదము 5:1 నిష్పత్తి లో విత్తుకోవచ్చు.

మొవ్వకుళ్ళు తెగులు

ఇది వైరస్ తెగులు,తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. లేత ఆకులపై నిర్జీవ వలయాలు లేక చారలు కనిపిస్తాయి.ముదురు ఆకుల్లో ఈ లక్షణాలు కనిపించవు. లేత దశలో తెగులు ఆశిస్తే మొక్కలు కురుచబడి,ఎక్కువ రెమ్మలు వస్తాయి.ఆకులు చిన్నవిగా అయి లేత ఆకుపచ్చ మచ్చలు కల్గి పాలిపోయి ఉంటాయి. 15రోజుల తర్వాత తెగులు ఆశిస్తే మొవ్వు ఎండిపోయి,కుళ్ళిపోతుంది.క్రమంగా మొక్క అంతా ఎండిపోతుంది. వేర్లు,ఊడలు,కాయల మీద మచ్చలు ఏర్పడి కుల్లిపోతాయి.ఈ తెగులు సోకిన మొక్కలనుండి వచ్చిన వేరుశనగ విత్తనాలు చిన్నవిగా ఉండి,ముడుచుకొని ఉంటాయి. నివారణకు తెగులును కొంతవరకు తట్టుకునే కదిరి-3,ఆర్ 8808,వేమన,ఐ.సి.జి.యస్-రకాలను సాగుచేయాలి. వేరుశనగతో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి. విత్తిన 20రోజుల తర్వాతతామర పురుగుల(త్రిప్స్)వ్యాప్తి అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ.లేక డైమిధోయేట్ 2మి.లి.లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ తెగులు

త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు కొంచం గుండ్రంగా వుండి,ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కల్గి వుంటాయి. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు మచ్చలు చిన్నవిగా,గుండ్రంగా వుండి,ఆకు అడుగు భాగాన నల్లని రంగు కల్గి వు౦టాయి.కాండం మీద,ఆకు కాడల మీద,ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. వేరుశనగలో సజ్జ పంటను 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేయాలి. నివారణకు తెగులును తట్టుకునే రకాలను(వేమన,జె.సి.జి-88 సాగుచేయాలి. తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మా౦కోజెబ్ 400గ్రా.లేదా కార్బ౦డజిమ్ 200గ్రా.లేదా క్లోరోథలోనిల్ 400గ్రా.లేదా హెక్సాకొనాజోల్ 400 మి.లీ చొప్పున 200లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.తాయి.

వేరుపురుగు

వేరు పురుగు యొక్క తల్లి పురుగులు (పెంకు పురుగులు)తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి పొలంలో వున్న వేప/రేగు చెట్లను ఆశిస్తాయి. బాగా ఎదిగిన వేరుపురుగు లార్వా ‘ఈ’ ఆకారంలో వుండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. వేరుపురుగు ఆశి౦చిన మొక్కలు వాడి,ఎండి చనిపోతాయి.మొక్కను పీకితే సులువుగా ఊడి వస్తాయి.మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. బెట్ట పరిస్థితులలో ఒక్క సారి పంట చచ్చి పోతుంది. విత్తనము 1కి.గ్రా కు 61/2 మి.లీ క్లోరిపైరి ఫాస్ పట్టించి విత్తవలెను. 150 కి.గ్రా.ల వేపపిండి దుక్కిలో వేయవలెను. లోతు దుక్కి చేయడం వలన వేరుపురుగు కోశస్థదశబయట పడి పక్షులు వాటిని తింటాయి.

ఆకుముడత

ఆకుముడత విత్తిన 15 కోజుల నుండి ఆశిస్తుంది. ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. వాటిలోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు వుంటాయి.ఇవి 2,3 ఆకులను కలిపి వాటిలో వుండి,పత్రహరితాన్ని తినివేయడం ఆకులన్ని ఎండి,కాలినట్లు కనపడతాయి నివారణకు అంతర పంటలుగా జొన్న,సజ్జ 7:1 నిష్పత్తిలో వేయాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి రెక్కల పురుగు ఉనికిని,ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్న జీవులు 50 శాతం పైగా ఉన్నపుడు క్రిమి సంహారక మందులు వాడవలసిన అవసరం లేదు. క్వినాల్ ఫాస్ 2.0మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కలుపు నివారణ,అంతర కృషి: ముందు ఫ్లుక్లోరాలిన్ 45శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తే ముందు పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి లేదా పెండిమిథాలీన్ 30శాతం ఎకరాకు 1.3-1.6 లీ.లేదా బుటాక్లోర్ 50శాతం 1 లీటరు.చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారి చేయాలి.విత్తిన 20,25 రోజులప్పుడు గోర్రుతో అంతరకృషి చేయాలి మరియు మొక్కల మొదళ్ళుకు మట్టిని ఎగదొయాలి.విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి.45రోజుల తర్వాత ఏవిధమైన అంతరకృషి చేయరాదు లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది.

3 views0 comments
bottom of page