top of page

Maize / మొక్క జొన్న!

మొక్క జొన్న

మన రాష్ట్రంలో మొక్క జొన్న వర్శాధారంగాను మరియు సాగునీటిక్రింద ఖరీఫ్,రబీ కాలాల్లో పండించబడుతుంది.మొక్క జొన్న ఆహార పంటగానే గాక దాణారూపంలోను,పశువులకు మేతగాను,వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను,పేలాల పంటగాను,తీపికండే రకంగాను మరియు కాయగూర రకంగాను సాగుచేయబడుతుంది.

నేలలు

ఇసుకతో కూఇసుక,రేగడి,గరప మరియు లోతైన మధ్యరకపు రేగడి నేలలు అనుకూలం.నీరు నిల్వ ఉంచుకొనే శక్తి గల,మురుగు నీరు పోయే వసతిగల మరియు ఉదజని సూచిక 6.5నుండి 7.5వరకు గల నేలలు అననుకూలం.ఆమ్ల,క్షార,చౌడ,నీరు నిలువ ఉండే భూములు సాగుకు పనికిరావు.

విత్తేకాలం మరియు విత్తే సమయం

ఖరీఫ్ లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జూన్ 15 జూలై 15వరకు,రబీ తెలంగాణా రాయలసీమ ప్రాంతాలలో అక్టోబర్ 15నుంచి జనవరి 15వరకు విత్తుకోవచ్చు.వర్షాభావ పరిస్థితుల్లో ఆగుష్టు లోపు విత్తుకోవాలి.

విత్తన మోతాదు

ఎకరానికి సాధారణ రకాలకు 7కిలోలు ,పాప్కార్న్ మరియు మాధురి రకాలకు 4-5 కిలోల విత్తనం అవసరం.

విత్తే దూరం

బోదె నాగలితో వరసుల మధ్య 60-75సె౦.మీ. మొక్కల మధ్య 20-25సె౦.మీ.ఎడం ఉండేటట్లు సాళ్ళు చేసుకోవాలి.బోదెసాళ్ళ కుడివైపు 1/3ఎత్తులో 2సెం.మీ లోతులో విత్తుకోవాలి.ఈ రకంగా ఎకరాకు 26,666మొక్కల సాంద్రతతో విత్తుకోవాలి.ప్రత్యేక రకాలకు సాలుకు సాలుకు మధ్య 60సెం.మీ మొక్కకు,మొక్కకు మధ్య 20సెం.మీ సరిపోతుంది.బోదెసాళ్ళు నీటిపారుదలకు,అధిక నీటిని తీసివేయటానికి మరియు పంట పెరుగుదలకు ఉపయోగపడతాయి.

ఎరువులు

నత్రజనిని విత్తేటప్పుడు 1/4వంతు ,విత్తిన నెల రోజులకు 1/2వంతు ,50-55రోజులకు మిగిలిన 1/4 వంతు వేయాలి.వర్షాధారపు పంటకు 2/3వంతు నత్రజని ని విత్తే సమయంలోను మిగిలిన నత్రజనిని విత్తిన 30-40రోజులకు వేయాలి.మొత్తం భాస్విరం మరియు పోటాష్ ఎరువుల్ని విత్తే సమయంలో వేయాలి.

నీటి యాజమాన్యం

మొక్కజోన్నకు పూతకు ముందు,పూత దశలో ,గింజ పాలు పోసుకునే బాగా నీరు పెట్టడం అవసరం.౩౦-40 రోజులలోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం.విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు.

కలుపు నివారణ,అంతర కృషి

మొక్కజోన్నకఎకరానికి కిలో నుండి కిలోన్నర అట్రజిన్ 50శాతం పొడి మందును 200లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా రెండు,మూడు,రోజుల్లో భూమిపై పిచికారి చేయాలి.30-45రోజుల దశలో పాపటం (కల్టివేటర్) తో అంతర కృషి చేసి తర్వాత బోదె నాగలితో సాళ్ళు చేసుకోవాలి.

అంతర పంటలు

మొక్క జొన్న కందితో గాని ఇతర అపరాలతో గాని అంతరాపంటగా 2:1 పాళ్ళలో విత్తుకోవాలి.కూరగాయలతో కూడా అంతరాపంటగా సాగు చేసుకోవచ్చు.ముల్లంగి: మొక్కజొన్న(1:1) లభాదాయకం.పండ్లతోటల్లో మొదటి 3-5 సంవత్సరాల వరకు అంతర పంటగా సాగు చేయవచ్చు.మొక్కజొన్న తర్వాత ,వేరు శానగ లేదా ప్రొద్దుతిరుగుడు లేదా కంది పంట వేసుకోవచ్చు.

ఆకుమాడు తెగులు

ఆకులపై పొడవైన కోలగా ఉండే బూడిద రంగుతో కూడిన ఆకు పచ్చ లేక గోధుమ రంగు మచ్చలు కన్పిస్తాయి.ఈ మచ్చలు క్రింద ఆకులపై కనిపించి ,తర్వాత పై ఆకులకు వ్యాపిస్తాయి.అధిక తేమతో కూడిన వాతావరణంలో ఆకు ఎండి మొక్కలు చనిపోయినట్లుగా కనిపిస్తాయి.దీని నివారణకు లీటరు నీటికి 2.5గ్రా మా౦కోజెబ్ కలిపి పిచికారి చేయాలి.డి.హెచ్.యం.1 రకాన్ని విత్తుకోవాలి. వడలు తెగులు(సెఫాలోస్పోరియం అక్రిమోనియమ్)(బ్లాక్ బండిల్) ఆకులు మరియు కాండం ఊదారంగుకు మారి,తర్వాత కాండం మొదటి 1,2కణువులపై గోధుమ రంగు చారలు ఏర్పడి లోపలి నాళాల నల్లగా మారి ఎండిపోతుంది.

కాండం తొలిచే చారల పురుగు

ఎక్కువగా ఖరీఫ్ లో ఆశిస్తుంది.మొక్కజొన్న మొలకెత్తిన 10-20రోజుల పైరును ఆశించి ఆకుల అడుగుభాగంలో గుడ్లను సముదాయంగా పెడుతుంది.గుడ్లు 4-5రోజులకు పగిలి పిల్ల పురుగులు మొక్క జొన్న అంకురంలోనికి చేరుకుంటాయి.అవి ఎదిగే అంకురాన్ని తింటే మొవ్వు చనిపోయి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.లేదా ఎదిగే ఆకులకు రంధ్రాలు ఏర్పరచి తి౦టాయి.అందువల్ల ఆకుపై గుండ్రని రంధ్రాలు వరుసలలో కనిపిస్తాయి.ఈ పురుగు ఆకులని,కాండాన్ని,పూతని,క౦కిని ఆశించి నష్టం కలుగజేస్తుంది

1 view0 comments
bottom of page