top of page

Paddy / వరి !

వమన రాష్ట్రా౦లో వరిప్రదానంగా ఖరీఫ్ మరియు రబీ ప౦ట కాలాల్లో, పలు వాతావరణ పరిస్టితుల్లో సాగుచేయబడుతు౦ది. నారుమడులు పోయాలనుకున్న భుములకు వేసవి దుక్కికి ముందుగానే హెక్టారుకు 5-10 టన్నుల పశువుల ఎరువును వేయాలి, నారుమడులను పోయడానికి పొలంలో 10వ భాగాన్ని ఎ౦పిక చేసుకోవాలి.ఎ౦పిక చేసుకున్న పొలానికి 5-10 సె౦. మీ. నిళ్ళు పెట్టె బాగా కలియ దున్నాలి.తరువాత మట్టెగడ్డలన్ని మెత్తగయ్య్లోలా బాగా దమ్ము చేయాలి. బాగా దమ్ము చేసిన తరువాత పొలం ను౦డి కలుపు మొక్కలు లేకు౦దా జాగ్రత్త పడాలి.

విత్తన మోతాదు

నాటే పద్ధతికి 20-25 కిలోలు, వెదజల్లటానికి (గరువు) భూముల్లో) 24-౩0 కిలోలు, గొర్రుతో విత్తటావికి (వర్షాధారపు వరి) 30-36 కిలోలు, శ్రి పద్ధతిలో 2 కిలోలు సరిపోతుంది.

విత్తన శుద్ది

కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్చండజిమ్ కలిపి 24 గ౦టల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. దంప నారుమళ్ళ కైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బండజిమ్ కలిపి, ఆ ద్రావణ౦లో విత్తనాలను 24 గ౦టలు నానబెట్టీ , 24 గ౦టలు మ౦డెకట్టీ మొలకలను ద౦ప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లిటరు మందు నీరు సరిపోతుంది. పది లిటర్ల నీటికి 1.5 కిలోల ఉప్పు కలుపగా వచ్చిన ద్రావంలో ఎ౦పిక చేసుకున్న విత్తనాన్ని పోసి పైకి తేలిన తాలు విత్తనాలను తీసివేయాలి. ఉప్పునీటిలో మునిగిన గట్టీ విత్తనాలను నారు పోయడానికి వాడుకోవాలి. మడిలో చల్లే ము౦దు 24 గంటల పాటు మంచినీటిలో విత్తనాలను నానబెట్ఠాలి . విత్తనాల ద్వారా సంక్రమి౦చే లెగుళ్ళ నివారణ కోస౦ కిలో విత్తనానికి 3 గ్రా. దైరమ్ లేదా కాప్టాన్ మ౦దును కలిపి విత్తన శుద్ది చేయాలి. నారుమడిలో చల్లేము౦దు మొలకెత్తిన విత్తనాన్ని 0.2 శాత౦ క్లోరిప్రేరిఫాస్ ద్రావణంలో నాసబెట్టీ చల్లుకోవాలి. దీని వల్ల నారుమడిలో ఆకు తినే పురుగులు, ఉల్లికోడు ,మొవ్వపురుగు ఆశి౦చకు౦డా ఉ౦టాయి.

కొసలు త్రుంచడం

తల్లి పురుగులు గ్గ్రుడును కోసల మీద పెడుతుంది కావున నారు నాటేటప్పడు కొసలు విరిచి నాటాలి. దీనితో గ్గ్రుడును నిర్మూలించవచ్చ .

నారుమడి

దమ్ము చేసిన నేలను 10 మీ. పోడవు 1 మీ. వెడల్పుతో నారుమడిని చేసుకోవాలి. నారుమడిలోని నీరు పోషకాలు బయటపోకుండా ఉండేలా గట్లు వేసుకోవాలి. గట్ట్లును సమంగాను గట్టిగాను పోయాలి. మడిలో చెతాచెదారం లేకుండా జాగ్రత్తపడాలి . నారుమడి బురద పదునులో ఉండాలి. నారుమడులు ఎత్తుగా ఉండేలా జాగ్రత్తపడాలి. రెండు మడుల మధ్యలో 20సెం. మీ వెడల్పులో కాలువ తియాలి. కాలువలోని మట్టిని తీసి మడిలో వేసి నారుమడిని ఎత్తుగా చేసుకోవాలి. నారుమడి మొత్తం చదునుగా ఉండాలి.

సస్యరక్షణ

విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ ౩జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రా చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లి లేక క్లోరిఫైరిఫాన్ 2.0 మి.లి. లీటరు నీటికి కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేయాలి లేదా నారు తీయటానికి 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రా కార్బోఫ్యూరాన్ గుళికలు తక్కువ నీటిలో వేయాలి జింకు లోపాన్ని గమని లిటరు నీటికి 2గ్రా జింకు సల్ఫేటు ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరి సాగులో జింకు లోప ల్కక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి.

ఎరుపులు

5 సెంట్ల నారుమడిని 2 కిలోలు నత్రజని(1 కిలో విత్తనం చల్లేముందు,మరో కిలో విత్తిన 12-౧౪ రోజులకు ), 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భాస్వరం రెట్టింపు వేయాలి.

నారుమడి 10 -12 రోజులు ముందే దమ్మ చేసి చదును చేయాలి. నీరు పెట్టటానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్వాటు చేయాలి. 5 సెంట్ట నారుమడికి 2 కిలోల నత్రజని(1 కిలో విత్తనం చల్లేముందు,మరో కిలో విత్రిన 12-14 రోజులుకు), 1 కిలో భస్వరం మరియు 1కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి . చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భాస్వరం రెట్టింపు వేయాలి. మొలకలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకోవాలి. నారు పూరిగా పురివిచ్చుకునే వరకు ఆరు తడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు నిలకట్టాలి. జింకు లోపాన్ని గమనిసై లీటరు నీటికి 2 గ్రా జింకు ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలి ఎక్కువగా ఉండే దాళ్వా వరి సాగులో జింకు లోప లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి విత్తిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ ౩ జి గుళికలు సెంటు నారుమడికి 160 గ్రా చొప్పున వేయాలి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేక క్రోరిఫైరిఫాస్ 2.0 మి.లి. లీటరు నీటికీ కలిపి విత్తిన 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేయాలి లేదా నారు తియటానికి 7 రోజుల ముందు సెంటు నరుముడికి 160 గ్రా కార్బోఫ్యూరాన్ గులికలి తక్కువ నీటిలో వేయాలి తల్లి పురుగులు గ్రుడ్లను కోసల మీద పెడుతుంది కావున నారు నాటేటప్పుడు కొసలు విరిచి నాటాలి. దీనితో గ్రుడ్లను నిర్మూలించవచ్చ .

నాట్లువేయటానికి ప్రధాన పోలాన్ని తయారుచేయటం

నాట్లువేయటానికి 15 రోజుల ముందేపొలాన్ని మురగ దమ్ము చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతోగాని, అడ్డతోగని చదును చేయాలి. రేగుడి భూముల్లో నాట్లు వేయటానికి 2 రోజులముందుగానే దమ్ముపూర్తి చేసి, ఆ తర్వాత నాట్లు వేసై మంచిది.

సాంబ మషూరి(బిపిటి5204)

ఖరీఫ్ రకం , పపంటకాలం 145-150 రోజులు, దిగుబడి ఎకరాకు 6 టన్నులు. అగ్గితెగులు,ఎండాకు తెగులును తట్టుకుంటుంది. సన్నబియ్మం.

సోనా మషూరి(బిపిటి-3291)

ఖరీఫ్ రక౦,ప౦టకాల౦ 145 రోజులు, అగ్గి తెగులను తట్టుకు౦టు౦ది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. గింజ సననం.

విజేత (యంటియు-1001)

ఖరీఫ్ రకం ,పంటకాలం 140 రోజులు, రబీ కాలానికి కూడా అనుకూల౦ సుడిదోమ, అగ్గి తెగులును తట్టుకు౦టు౦ది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. కోస్తా జిల్లాల్లో‘ రె౦డు ప౦టలు పండించటానికి అనుకూలయైనది- సన్నబియ్యం.

కాటస్ దొర సన్నాలు(యంటియు-1010)

రబీ రకం, ప౦టకాల౦ 120 రోజులు- సుడిదోమ, అగ్గి తెగులు కొ౦త వరకు తట్టుకు౦టు౦ది.దిగుబడి ఎకరాకు 3.2 టన్నులు- గింజ ఐ.అర్.64 వలె సన్న రకం. జి౦కు లోప౦ విజేత వలెరాదు

నారు తీసేటపుడు మొక్కలు లేతాకుపచ్చగా వుంటీనే మూన త్వరగా తిరుగుతుంది. నాలుగు నుండిఆరుఆకులున్ను నారును ఉపమోగించాలి.ముదురు నారును నటితే దిగుబడి తగ్గుతుంది. నాటు నాటితే పిలకలు ఎక్కువగతొడిగే అవకాశముంది.నట్టువేసేతప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీప్ లో చ //మీ //కు ౩౩ మూనలు,రబీలో 44 మూనలు ఉండేలా చూడాలి. నాటిన తర్వాత ప్రతి రెండుమీటర్లకు 20సెం.మీ .బాటలు తీయటం వలన ఫైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడిపిడాల ఉదృతి కొంతవరకు అదుపుచేయవచ్చు. ఎరువులు,పురుగు మందులు,కలుపు మందులు వెయటానికి ఇంకా ఫైరు పరిస్ధితిని గమనించటానికి ఈ బాటలు బాగా ఉపమోగపడతాయి.వరిరకాల కలపరిమితిని బట్టి కుదుళ్ళు సంఖ్య ను నిర్దారించాలి. భూసారం ఎక్కువ ఉన్న పోలాల్లో తక్కువ కుదుళ్ళు ,భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి. ముదురు నారు నా టినపుడు కుదుళ్ళు సాంఖ్యను పెంచి, దగ్గర దగ్గరగా, కుదురుకు 4,5 మొక్కలు చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటినాపుడు నత్రజని ఎరువును మూడు దఫాలుగా గాక,రెండు దఫాలుగా- అంటే 70 శాతం దమ్ములోను మిగితా౩౦ శాతం అంకురందశలోనూవాడాలి.

పచ్చిరోట్టి పైర్లు

వరి మగాణుల్లో అపరాలు,జిలుగు ,జనుము,పిల్లిపెసర లాంటి ప్చ్చిరోట్టి పైర్లను వంచి కలియదున్నటం ద్విరా భూసారం పెరుగుడమే కాక సుమారు 20-25% నత్రజని, భాస్వీరం ,పొటాష్లను కూడాఅదా చేయవచ్చు.

సేంద్రియ ఎరువులు

పశువుల ఎరువు,కంపోషు,కోళ్ళు ఎరువులను ,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25 శాతం వరకు నత్రజనిని అదా చేయవచ్చు.

రసాయనిక ఎరువులు

భూసారాన్ని బట్టీ రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయంచి నత్రజని, భాస్వరం, ఫొటాష్, జి౦కు నిచ్చే ఎరువులను సమతుల్య౦గా వాడాలి. నత్రజనిని కాంప్లేక్సు ఎరువుల రూపలలోగాని, యూరియా రూపలలో గాని వాడపచ్చు. నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటుటకు ము౦దు దమ్మలోను దుబ్బుచేసే దశలోను , అ౦కుర౦ దశలోను, బురదపదనులో మాత్రమే సమాన౦గా వెదజలల్లి 36-48 గ౦టల తర్వాత పలుచగా నీరు పెట్ఠాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లీతే సత్రజని వినియోగ౦ పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. పొటొష్ ఎరువులను రేగడి నేల్లలో ఆఖరి దమ్ములో పూర్తీగా ఒకేసారి వేయాలి- చల్క (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం. అకుర౦ ఏరఎడు దశలో మిగతా సగాన్ని వేయాలి.కాంప్లేక్స ఎరువులను ఫైపాటుగా దుబ్బు చేసే సమయంలలో గాని, అంకురం ఏర్చడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది.

నీటి యాజమాన్యం

నాట్లు వేసేటపుడు నీరు పలుచగా ఉండాలి. ఎండలు ఎక్కువగాఉంటే ఊడ్చిన వెంటనే 5 సెం.మీ.వరకు నీరు నిలగట్టాలి.మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయటం పూర్త ఆయ్యే వరకు పొలంలోపలుచగాఅంటే 2-౩ సెం.మీ.నీరు౦డాలి.నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు .చిరుపోట్ట దశనుండి గింజ గట్టి పడే వరకు 5 సెం.మీ.లోతు వరకు నీరు౦చాలి. కోటకు 10 రోజులముందుగా నీటిని నెమ్మదిగా తగ్గి౦చి ఆరబెట్టాలి.

అగ్గి తెగులు లేక మెడ విరుపుతెగులు

ఆకుల పై ముదురు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగుగల నూలుకండే ఆకారపు మచ్చలు ఏర్వడతాయి.ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి.వెన్నుల మెడభాగంలో ఈతెగులు ఆశి౦చి వెన్నులువిరిగిపోతాయి. తట్లుకొను శక్తి గల రకాలనుసాగుచేయాలి.కిలో విత్తనానికి ౩ గ్రా.కార్భ౦డజియ్ కలిపి విత్తనశుద్ది చేయాలి.ట్రైసైక్లోజోల్ 75 శాతం 0.6గ్రా లేదా ఎడిఫెన్ఫాన్ 1 మి.లీ.లీటరు నీటికి కలిపి పైరు పైపిచికారి చేయాలి.చేనులోను,గట్లపైన కలుపు నివారించాలి.

పొడతేగులు లేక మాగు తెగులు

దుబ్బు చేసె దశ నుండి కా౦డ౦/మట్ట/ఆకులపై మచ్చలు పెద్దవై పాముపోడ మచ్చలుగా ఏర్పడుతు౦ది మొక్కలు,పైరు పూర్తీగా ఎండిపోతాయి. విత్తనశుద్ధి, సిఫారసు చేసిన నత్రజనిని ౩-4 సార్లు వేయాలి.గట్ల పెన ,చెనులో కలుపు లేకుండా చూదాలి.ప్రోపికోనజోల్ 1 మి.లీ.లేక హెక్సాకోనజోల్ 1 మి.లీ .లేక వాలిడామైసిన్ 2 మి.లీ .లీటరు నీటికి కలిపి 15రోజులకొకసారి రెండు పర్యాయాలు మ౦దు ద్రావణాన్ని పిచికారి చేయాలి.

ఆకు ఎండు తెగులు

ఇది బాక్టీరియా వల్ల వస్తుంది.ఆకుఅంచుల నుండి పసుపురంగు నీటిడాగు మచ్చలుగా ఏర్పడి ఆకుల పైనుండి క్రీందికి ఎండిపోతాయి. తట్టుకొనుశక్తి గల రకాలను సాగు చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన పంటనుండి విత్తనాన్ని సేకరించాలి .నత్రజని యాజ’మాన్యం (౩-4 సార్లు వేయడం) తప్పక చేయాలి. తెగులు 5 శాత౦ కంటె ఎక్కువైతే నత్రజని వేయడం తాత్కాలికంగా నిలుపుచేయాలి.

కా౦డ౦ కుళ్ళు తెగులు

ఆకుతోడిమ పై నల్లటిమచ్చలు ఏర్పడి,లోపలి కా౦డానికి విస్తరించి కణపుల మధ్య భాగమ౦తా సల్లగా మరుతాయి ఆకులు పసుపు రంగుకు మారిపిలకలు చనిపోతుంటాయి .పాలు పోసుకునే దశలో కా౦డ౦ ప్రదేశందగ్గర విరిగి పోతు౦ది. తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలి.విత్తనశుద్ధిచేయాలి.ప్రారంభ దశలోతెగులు లక్షణాలను గుర్త౦చి వాలిడామైసిన్(2.మి.లీ) లేదా హెక్సాకోనాజో ల్(2.మి.లీ.) లీటరునీటికి కలిపిన ద్రావాన్ని 15 రోజుల కొకసారి 2 సార్లు పిచికారి చేయాలి.

ఉల్లికోడు

వరి మగాణుల్లో అపరాలు,జిలుగు ,జనుము,పిల్లిపెసర లాంటి ప్చ్చిరోట్టి పైర్లను వంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరుగుడమే కాక సుమారు 20-25% నత్రజని, భాస్వీరం ,పొటాష్లను కూడాఅదా చేయవచ్చు. తట్టుకోనే వంగడాల సాగుచేయాలి. ఒక సెంటు నారుమడిలో 160 గ్రా కర్చోఫ్యురాన్ లేక 50 గ్రా ఫోరేట్ గుళికలు విత్తనం మొలకెత్తిన 7 నుండి 10 రోజుల లోపల వేయాలి. నాటిన 10 నుండి 15 రోజులకు ఎకరాకు 10కిలోల కర్చోఫ్యురాన్ లేక 5 కిలోల ఫోరేట్ గుళికలు వాడాలి.

కాండం తొలిచే పురుగు

నారుమడి దశ నుండి ఈనిక దశ వరకు ఆశిస్తు౦ది.పిలక దశలో మొప్పు చనిపోతు౦డి.ఈనిక దశలో తెల్లుకంకులు వస్తాయి. క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేక ఫాస్ఫో మిడాన్ 40 శాతం 2 మీ లీ .లేక ఎసిఫేట్ 1.5గ్రా లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక కార్టాప్ పైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు ఎకరాకు 8 కిలోల లేదా కర్చోఫ్యురాన్ ౩ జి గుళికలు ఎకరాకు 10 కిలోలు వాడాలి.

కంకి నల్లి(నల్ల కంకి)

ఇవి క౦టికి కనబడని సూక్ష్మి సాలిడు వర్గానికి చె౦దిన పురుగులు. ఇవి ఆశి౦చిన ఆకుల పై పసుపు వర్డపు చారలు ఏర్పడి క్రమేపి ఆకు తొడిమెల లోపల, ఆకు ఈనెల పై వృద్ది చె౦దుతాయి. ఆకు అడుగు భాగాన ఈనెల పై మరియు ఆకు తొడిమెల పై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. గి౦జల పై సల్లటి మచ్చలు ఏర్పడి పాలు పోసుకోక తాలు గి౦జలుగా అవుతాయి. బెట్ట పరిస్దితుబల్లో పురుగు ఉధృతి ఎక్కువగా ఉ౦టు౦ది. పురుగు సష్ణ లక్రణాలు గుర్తించిస వెంటనే ప్రోఫెనొఫాస్ 2 మి.లీ . లేక డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

ఆకుముడత/నాము/తెల్ల తెగులు

గొ౦గళి పురుగు ఆకు ముడతలో వు౦డి పత్రహరితాన్ని గోకి తినివేయట౦ వలస ఆకులు తెల్లబడతాయి.పోటాకు దశలో సష్ఠ౦ ఎక్కువ. పిలక దశలో తాడుతో చేనుకు అడ్డ౦గా 2-3 సార్ణు లాగితే పురుగులు క్రి౦దపడిపోతాయి. క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా లేక కార్ధాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక కార్దాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి ఎకరాకు 8 కిలోల వేయాలి.

సుడిదోమ

గోధుమ వర్ణపు/ తెల్లుమచ్చ దోమలు దుబ్బుల అడుగున నీటి మట్ట౦ పై వుండి దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి.పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది. తట్టుకొనే రకాలు సాగు చేయాలి. పొలాన్ని అడపా దడపా ఆరబెట్టాలి. ప్రతి రె౦డు మీ.లకి 20 సెం.మీల బాటలు వదలాలి. ఇతోఫెన్ ప్రాక్స్ 1.5 మి.లి. లేక ఎసిఫేట్ 1.5 గ్రా. లేక థమోమెథోకామ్ 0.20 గ్రా. లేక బి.పి.య౦.సి. 2 మి.లీ లేక మోనోక్రోటోఫాస్ 2.2 మి.లీ , లీటరు నీటికి కలిపి వాడాలి లేదా ఎకరాకు 10 కిలోల కార్బోప్యురాస్ ౩ జి గుళికలు వాడాలి.

కలుపు యాజమాన్యం

నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి బె౦థియోకార్బ్ 50% 1.5 ను౦డి 2.0 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 లేక ౩ రోజుల్లో లేదా 7 లేక 8వ రోజున గాని పిచికారి చేయాలి లేదా బె౦థియోకార్బ్ 50% 20 కిలోల ఇసుకతో కలిపి పలచటి నీటిపొర ఉన్నప్పుడు సమానంగా వెదజల్లి నీరు ఇ౦కేటట్లు చూడాలి లేదా విత్తిన 14, 15 రోజులప్పుడు సైకలోపాప్ బ్యు టైల్ 10%400 మి.లి. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. మాగాణి వరిలో ఊద మొదలైన ఏక వార్షక గడ్డిజాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యుటాక్లోర్ 50% 1 ను౦డి 1.5 లీ. లేదా అనిలోఫాస్ ౩౦% 500 మి.లీ. లేదా ప్రిటిలాక్లోర్ 50% 500 మి.లీ. లేదా బె౦థియోకార్చ్ 5o% 1.5 ను౦డి 2.0 మి.లీ లలో ఏదో ఒకదానిని ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన ౩ ను౦డి 5 రోజులలో పలుచగా నీరు పెట్టీ ససూన౦గా వెదజల్లాలి. గడ్డి ,తుంగ, వెడల్పటి ఆకు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యుటాక్లోర్ 5 శాత౦ గుళికలు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిస 3 ను౦డి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమాన౦గా వెదజల్లాలి లేదా ఎకరాకు 35 ను౦డి 50 గ్రా ఆక్సాడయార్టిల్ 80 శాత౦ పొడి మ౦దును 500 మి.లీ. నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 ను౦డి 5 రోజుల్లో పలుచటి నీరు ఉన్నప్పుడు సమాస౦గా వెదజలాలి. నాటిన 25-30 రోజులప్పుడు పొల౦లో వెడలాఎటి కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 400 గ్రా. 2, 4 -డి సోడియ౦ సాల్ట్ 80 శాత౦ పొడి మ౦దును 200 లి నీటిలో కలిపి కలుపు పై పడేటట్లు పిచికారి చేయాలి.

Expert Advice

Expert Advice

పంట మార్పిడి

9 views0 comments
bottom of page